20 May, 2026 | 9:57 AM

హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్య

20-05-2026 12:00 AM

ల్యాప్‌టాప్ దొంగతనం ఆరోపణలతో మనస్థాపం

శేరిలింగంపల్లి, మే 19 (విజయక్రాంతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీ యూ)లో మరో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మయాంక్ కుందు (ఎంఏ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి) యూనివర్సిటీ క్యాంపస్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మయాంక్ కుందుపై గతంలో రెండు ల్యాప్‌ట్యాప్‌లు దొంగిలించినట్లు ఆరోపణలున్నాయి. మంగళవారం మరో ల్యాప్‌ట్యాప్ పోవడంతో తనను మళ్లీ దొంగగా ముద్రవేస్తున్నారని తీవ్ర మనస్థాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.