12 March, 2026 | 10:05 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

విద్యార్థులకు చట్టాలపై అవగాహన

09-02-2026 06:31 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల ప్రమాదాలు, బాల్యవివాహాలు, రోడ్డు భద్రత, మహిళల రక్షణ, గుడ్ టచ్–బ్యాడ్ టచ్ అంశాలతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లు 1930, 100, 1098 వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

యువతలో క్రమశిక్షణ, నైతిక విలువలు,బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, కానిస్టేబుల్ సురేశ్, కళాబృంద సభ్యులు రోహిత్, రాంచందర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, రజిత, సంఘవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.