calender_icon.png 18 July, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

18-07-2025 12:57:31 AM

న్యాయ విజ్ఞాన సదస్సులో జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ 

బెల్లంపల్లి అర్బన్, జూలై 17:  బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ర్ట న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యతో పాటు సామాజిక జ్ఞానం ఎంతో అవసరం అన్నా రు. చట్టాలు రాజ్యాంగంపై ప్రతి విద్యార్థికి తగినంత అవగాహన  తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షు డు ఎ. శివకృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ దేవేందర్ రెడ్డి, బెల్లంపల్లి, సిర్పూర్ ఏపీపీఓలు, ఏజీపీ, సీనియర్ అడ్వకేట్లు పాల్గొన్నారు.

హాస్టల్ తనిఖీ చేసిన న్యాయమూర్తి...

కళాశాలలోని మూడు హాస్టళ్లను ఆకస్మికంగా సందర్శించి, వసతి గదులు, డైనింగ్ హాల్, కిచెన్, స్టోర్ రూమ్‌లను జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాము ఖి మాట్లాడుతూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే తరగతి గదులు, ల్యాబొరేటరీలు, వర్క్‌షాప్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, కౌన్సిలింగ్ హాల్, కార్యాలయం తదితర ముఖ్య విభాగాలను పరిశీలించి, నిర్వహణ ప్రమాణాలను ప్రశంసించారు.