18-07-2025 12:58:36 AM
కర్షక్ బి.ఎడ్ కళాశాల కార్యదర్శి విశ్వనాథం
కామారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రెండవ స్నాతకోత్సవంలో కామారెడ్డి కర్షక్ బి.ఎడ్ కళాశాల విద్యార్థులకు వరుసగా ఐదు విద్యా సంవత్సరాలకు గాను 2017,2018,2019,2020,2021 బి.ఎడ్ విభాగంలో టాపర్లు గా నిలిచి బంగారు పథకాలు సాధించినట్లు కళాశాల కార్యదర్శి విశ్వనాథం తెలిపారు.
రాష్ట్ర చరిత్రలోనే ఏ యూనివర్సిటీలో కూడా ఐదు సంవత్సరాలు వరుసగా ఒకే కళాశాలకు ఇప్పటివరకు బంగారు పథకాలు రాలేదని,ఆ ఘనతను సాధించిన ఏకైక కళాశాలగా కర్షక్ బి.ఎడ్ కళాశాల నిలిచిందని అన్నారు.వీరికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బంగారు పథకాలను అందజేసినట్లు తెలిపారు. పురస్కరించుకొని గురువారం కర్ష బీ ఈడి కళాశాలలో బంగారు పతక విజేతలను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి వి.విశ్వనాథం మాట్లాడుతూ బి.ఎడ్ విభాగంలో విశ్వవిద్యాలయ పరిధిలో అత్యుత్తమ ప్రతిభను కనబరచడమే కాకుండా వరుస సంవత్సరాలలో బంగారు పథకాలను సాధించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు.సమాజానికి ఉపాధ్యాయుడు వెన్నుముక లాంటి వాడని అటువంటి ఉపాధ్యాయుడిని తయారు చేసే విద్య కళాశాలలు అత్యంత విలువైనవని అన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్స వంలో కూడా కర్షక్ బి.ఎడ్ విద్యార్థినికే బంగారు పతకం రావడం జరిగిందని అన్నారు,ఈ సందర్భంగా ఆయన బంగారు పథకాలను సాధించిన ఐదుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యంతో కలిసి ఘనంగా సన్మానించారు, బంగారు పథకాలు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ మా విజయం వెనుక కళాశాల అధ్యాపకులు,తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువ లేని దని నిష్కలంకమైన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తూ,
ఉత్తమ పౌరులను తయారు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం పుండరీకా చారి, వీరయ్య,లక్ష్మయ్య,ప్రతాప్ రెడ్డి,జనార్దన్ రెడ్డి,పెంటయ్య,కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.కె.రషీద్ అధ్యాపక బృందం కిషన్,డాక్టర్ బాలు,భీమాగౌడ్,మమత, తయ్యబ, బాబురావు, విద్యార్థులు పాల్గొన్నారు.