ఉపాధ్యాయుల కోసం రోడ్ ఎక్కిన విద్యార్థులు..
* ముగ్గురు ఉపాధ్యాయులకు డిప్యూటేషన్... ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు..
ఉట్నూర్, సెప్టెంబర్ 28( విజయక్రాంతి ): ఉట్నూర్ మండలం(Utnoor Mandal)లోని సాలెవాడ గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో విద్యా బోధించే ఉపాధ్యాయులు కావాలంటూ.. విద్యార్థులు రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. మండలంలోని సాలెవాడలోని పాఠశాలలో విద్యా చదువుకునే 36 మంది విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలోని కుమ్మరి తాండకు నడిచి వచ్చి ఆర్ అండ్ బి రోడ్డుపై ఉపాధ్యాయులను పంపించాలంటూ డిమాండ్ చేస్తూ స్కూల్ బ్యాగులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సాలెవాడా సర్పంచ్ మెస్రం రాధాబాయి, గ్రామస్తులు మాట్లాడుతూ... తమ గ్రామంలోని పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు 36 మంది విద్యార్థులువిద్యను అభ్యసించితుండగా... నెలరోజుల క్రితం పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపించారని ఆరోపించారు. ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపిన విషయాన్ని జిల్లా కలెక్టర్ తో పాటు ఐటిడిఏ పిఓ కు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేశామని సర్పంచ్ అన్నారు. ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై పంపిన విషయం జిల్లా అధికారులకు తెలపడంతో
సాలెవాడకు రెండు కిలోమీటర్ల దూరంలోని తాండ్రలోని యుపిఎస్ పాఠశాల నుండి ఉపాధ్యాయురాలుని డిప్యూటేషన్ పై పంపించారని గుర్తు చేశారు. పాఠశాలకు వచ్చిన మహిళా ఉపాధ్యాయురాలు ఐదు తరగతులకు విద్యా బోధన చేయడంలో ఇబ్బందులు పడడంతో పాటు గతంలో చదువు నేర్చుకున్న మరిచిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డిప్యూటేషన్ పై పంపిన ముగ్గురు ఉపాధ్యాయులను తమ పాఠశాలకు పంపించాలని డిమాండ్ చేశారు.