లక్ష్యంతో చదవాలి...విజయం సాధించాలి డాక్టర్ మట్టా
సత్తుపల్లి సెప్టెంబర్27(విజయ క్రాంతి): లక్ష్యంతో చదివితే విజయం సాధించవచ్చు అని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని జేవియర్ డిగ్రీ కళాశాల(Xavier Degree College)లో కెరియర్ గైడెన్స్, జెకెసి ఆధ్వర్యంలో నిర్వహించిన కానిస్టేబుల్.. 2026 మాక్ టెస్టు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యంతో చదివితే విజయం సాధించవచ్చని, ఏదైనా కష్టపడితేనే ఫలితం వస్తుందని, గోల్ పెట్టుకుని చదవటం వలన విజయం మీదే అవుతుందని, దీని ద్వారా భవిష్యత్తు, సమాజానికి,తల్లిదండ్రులకు గొప్ప పేరు వస్తుందని విద్యార్థులకు హితబోధ చేశారు. మాక్ టెస్టు అక్టోబర్ 3 న శనివారం నిర్వహిస్తున్నారని, దీని ద్వారా పరిజ్ఞానం పెరుగుతుందని,ప్రతి ఒక్కరూ హాజరై లోటుపాటులను తెలుసుకొని, భవిష్యత్తుకు సరళమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నారావు,కమల్ పాషా, మలిరెడ్డి మురళి రెడ్డి, కళాశాల సిబ్బంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.