యువకుడి ఆత్మహత్య
13-09-2026 | 12:50am
ముదిగొండ,(విజయక్రాంతి): ముదిగొండలో మెట్టెల వినయ్ అనే యువకుడు ఒక ప్రయివేటు కాలేజీ లో బీటెక్ చేసాడు గత మార్చి నెల లో అతని పై పొక్సో కేసు(POCSO case) నమోదు అయి 72 రోజులు జైలు కీ వెళ్లి నెల క్రితం మే బెయిల్ పై విడుదల అయ్యాడు. పొక్సో కేసులో జైలుకు వెళ్ళొచ్చిన వినయ్ తనను కేసు విషయంలో ఇద్దరు వ్యక్తులు అజిజ్, నూకల నాగేశ్వరావు 20లక్షలు ఇవ్వాలని వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ముదిగొండ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పంచనామా అనంతరం వినయ్ కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు