అమరవీరుల కుటుంబాలకు అండ
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
- యాదిరెడ్డి, కరంచంద్ త్యాగాలను మరువం
- కుటుంబాలకు కేటీఆర్ భరోసా
మొయినాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సిద్ధి కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, వారికి అన్ని వేళలా అండగా నిలుస్తుందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం సాయం త్రం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో కేటీఆర్ పర్యటించారు.
అమరుడు యాదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పెద్ద మంగళారం గ్రామానికి యాదిరెడ్డి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యాదిరెడ్డి తల్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 500 గంటల ఇంటితోపాటు ఆర్థిక సహా యం అందజేసిందని గుర్తు చేశారు. తెలంగాణ సమాజం ఉన్నంతవరకు అమరుల కుటుంబాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మొయినాబాద్ పరిధిలోని ఎనికేపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త కరంచంద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. పార్టీకోసం కృషి చేసిన ప్రతీఒక్కరిని ఆదుకుంటామన్నారు. కేటీఆర్ వెంట పర్యటనలో భారీ ఎత్తున బీఆర్‌ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. ఈ పర్యటనలో మాజీ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, నా యకులు దేశమల్ల ఆంజనేయు లు, కొంపల్లి అనంత రెడ్డి, కోట్ల నరోత్తం రెడ్డి, కొత్త నరసింహారెడ్డి, ముదిగొండ రవి యా దవ్, సుధాకర్ యాదవ్, మోర శ్రీ నివాస్, మోహన్ రెడ్డి, పాటి ప్రసాద్ రెడ్డి, ప రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నే తలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






