29 June, 2026 | 1:42 AM

బీసీ కులగణన చేపట్టాలి

29-06-2026 01:01 AM
  1. హామీ ఇచ్చి మోసం చేసిన కేంద్రం
  2. ఢిల్లీలో లక్షలాది మందితో బీసీ గర్జన నిర్వహిస్తాం
  3. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల  
  4. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో మహా ర్యాలీ  

హైదరాబాద్, జూన్ 28(విజయక్రాంతి) : బీసీ డిమాండ్ల సాధన కోసం రైతు ఉద్యమ తరహాలో ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షు డు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. జాతి జన గణనలో ఓబీసీ కుటుంబాలను లెక్కించకుండా కేంద్రం బీసీలను నయవంచనకు గురిచేసిందన్నారు. బీసీలను వంచిం చిన కేంద్రానికి బుద్ధి చెప్పడానికి డిసెంబర్‌లో లక్షలాది మందితో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీసీ గర్జన నిర్వహించి బీ సీల సత్తాను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.

ఆదివారం రాష్ట్రీయ ఓబీసీ మ హాసంగ్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని చం ద్రాపూర్ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ నుం చి జిల్లా కలెక్టరేట్ వరకు వేలాది మందితో మహా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జాజుల శ్రీనివాస్ గౌడ్ (తెలంగాణ) కేసన శంకర్ రావు, (ఆంధ్రప్రదేశ్), ప్రొఫెసర్ భవన్ రావు తైవాడే (మహారాష్ట్ర), ప్రతిభ దానోల్కర్ (చంద్రాపూర్ ఎంపీ) సంజయ్ దేర్వర్కర్ (ఎమ్మె ల్యే శివసేన) అభిజిత్ వంజరి (కాంగ్రెస్ ఎమ్మెల్యే) రత్నమాల పిసే (మధ్యప్రదేశ్)సాహు యాదవ్ ( బీహార్) తో పాటు 16 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

జాతి జన గణనలో ఓబీసీ కులగణన చేపడతామని దేశంలోని 60 కోట్ల మంది ఓబీసీ లను నమ్మించి కేంద్రం మోసం చేసిందని, కులగణను చేపట్టి జనాభా దామాషా ప్రకా రం బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఓబీసీ సంఘాల నేతలు సంయుక్తంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివా స్‌గౌడ్ మాట్లాడుతూ ఓబీసీలకు దేశవ్యాప్తం గా కులగణనను చేపట్టకుండా బీసీ రిజర్వేషన్ పెంచకుండా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా, గత 12 సంవత్సరాలుగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని బీసీలకే అన్యాయం చేసిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా జన్ జీ ఉద్యమ తరహాలో రాజకీయ పార్టీలకతీతంగా ఓబీసీలు ఏకమై ఉద్యమించే సమ యం ఆసన్నమైందన్నారు.

ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు మాట్లాడుతూ 80 ఏళ్లుగా జనాభా అధికంగా ఉన్న ఓబీసీలకు అన్ని రంగాల్లో అన్యా యం జరుగుతూనే ఉందని ఈ అన్యాయా న్ని సరిదిద్దడానికి బీసీలు ఒక్కటిగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి ఉద్యమించుదామని పిలుపునిచ్చారు.

రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ ప్రధాన కార్యదర్శి సచిన్ రాజోల్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా ర్యాలీలో బీసీ వి ద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, గోదా వరుణ్ కుమార్, జాజుల భాస్క ర్ బండిగారి రాజు పాల్గొన్నారు.