29 June, 2026 | 3:32 AM

ఓటుహక్కు అత్యంత విలువైనది

29-06-2026 02:18 AM

మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్

ఘట్‌కేసర్, జూన్ 28 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు ఈ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో భాగస్వామి కావాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్, నారపల్లిలోని పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అవగాహన సదస్సు, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం జరిగింది.

పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై సర్ కార్యక్రమం ప్రాముఖ్యతపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, బూత్ స్థాయి నాయకులకు అవగాహన కల్పించారు. అనంతరం నారపల్లి ప్రాంతంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు.  బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కలిసి నమోదు ప్రక్రియను సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఇటిక్యాల కృష్ణారెడ్డి, ఘట్కేసర్ మండల అధ్యక్షులు కర్రె రాజేష్, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, బాబురావుగౌడ్, మాజీ కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎర్ర రాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్ర మాధవి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ ఎంపీటీసీ నర్రి శ్రీశైలం, సహదేవ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, పోశెట్టి, బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.