1 June, 2026 | 5:26 PM

ఎస్వీ కృష్ణారెడ్డి వరల్డ్ రికార్డ్

01-06-2026 04:43 PM

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్వీ కృష్ణారెడ్డికి(SV Krishna Reddy) అరుదైన గౌరవం దక్కింది. ఎస్వీ కృష్ణారెడ్డి పేరు ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. 38 సినిమాలకు స్వయంగా సంగీత దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’ నుంచి వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం వేదవ్యాస్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో కొరియన్ నటి ‘జూన్ హ్యూంజీ’, మంగోలియన్ నటుడు ‘షరన్ బోల్డ్’ టాలీవుడ్‌ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.