calender_icon.png 6 May, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

20-04-2025 12:00:00 AM

నెమలి పించం..

చిన్నప్పుడు నోట్‌బుక్ పేజీల మధ్యలో నెమలి పించాన్ని పెట్టేవాళ్లం. ఆ జ్ఞాపకాలు చెరగని గురుతులు. చిన్ననాటి జ్ఞాపకాల్లో పుస్తకాలలో నెమలి పించం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి. మన చిన్నతనం, పుస్తకాల పట్ల మనకున్న ఆప్యాయత, ప్రేమను తెలియజేస్తుంది. కాని ఇప్పటి తరం పల్లెటూరి పసితనాన్ని చంపేస్తుంది. ఆటలు లేవు, ఎండాకాలం సెలవులు లేవు.. ఎక్జామ్స్‌కు, కోచింగులు, భవిష్యత్తు గురించి భయాలు. ఇవన్నీ అందరికి తెలిసినవి. 

తాటి ముంజల బండి..

స్టీరింగ్ వీల్ చేత పట్టి చిన్నతనంలో ముంజల బండి పట్టుకుని ఒక్కటే పరుగులు తీసేది. వేసవిలో శరీర ఉష్ణోగ్రత నియంత్రించడంలో తాటి ముంజలు బాగా పనిచేస్తాయి. అయితే తాటి కాయపైన చెక్కి ముంజలు, కాయ నుంచి వేరు వేస్తారు. వాటిని తింటే శరీరానికి చలువ చేస్తుంది. ముంజలు తీసివేసిన కాయ భాగాలను తీసుకుని బండి తయారు చేసుకునేది. తాటికాయకు ఆరు అంగుళాల కర్రను గుచ్చి.. బండికి స్టీరింగ్ తయారు చేసి.. పరుగో.. పరుగులు తీసేది.