calender_icon.png 6 May, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు తెలుసా?

20-04-2025 12:00:00 AM

రెండు వందలేళ్లు..

ప్రపంచంలో పర్వతారోహణ కంపెనీని మొదలుపెట్టి రెండు వందలేళ్లు అవుతున్నది. అదే చామోనిక్స్ గైడ్స్ కంపెనీ. ఈ సందర్భంగా ఆలఫ్స్ లోని అతి ఎత్తున బ్లాంక్ పర్వతాన్ని అధిరోహిస్తున్నారు పర్వతారోహకులు. 

ఎంత సాహసం?

హెలికాఫ్టర్ నుంచి వేలాడుతూ ఏదో సాహస విన్యాసంగా అనిపిస్తుంది. కాని వీళ్లందరూ సాయుధులైన పోలీసులు. ఓ మహిళను హత్య చేసి పారిపోయిన వ్యక్తి కోసం ఇలా గాలిస్తున్నారు ఫ్రాన్స్ పోలీసులు. 

తోలుబొమ్మ

టోక్యో ఒలింపిక్స్‌లో అందరినీ ఆకట్టుకుంది మొకో. పది మీటర్ల పొడవున్న పెద్ద తోలుబొమ్మ ఇది. జపాన్ సంస్కృతిలో తోలుబొమ్మలు ఓ భాగం. పదేళ్ల క్రితం సునామీ తాకిడికి అతలాకుతలం అయిన తోహికు ప్రాంత ప్రజలు మొకోను రూపొందించడం విశేషం. 
 
చేపల పండుగ

జూలై నుంచి సముద్రాల్లోకి వెళ్లేవారు నీళ్లపైనే ఎక్కువగా దష్టిపెడతారు. వేల్‌షార్క్‌లు ఈ సమయంలోనే బయటికి కనిపిస్తుంటాయి. చేపల్లో అతి పెద్దది ఆడ వేల్ షార్కు. మెక్సికో సమీపంలో ఓ వేల్‌షార్క్ ఇలా కెమెరాకు చిక్కింది.

బెలూన్ల సమయం

ఆకాశం అంతేమిటో చూద్దామని అందరికీ ఉంటుంది. కాని ప్రతి ఒక్కరూ రాకెట్లేసుకుని వెళ్లలేరు కదా. కొంతమంది ఇలా హాట్ ఎయిర్ బెలూన్లలో గాల్లో తేలిపోతారు. అమెరికాలోని ఐడాహోలో టెటాన్ వ్యాలీ బెలూన్ ర్యాలీ జరిగింది. గత నలభై ఏళ్లుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.