calender_icon.png 6 May, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో నేడు

20-04-2025 12:00:00 AM

చైనీస్ భాషా దినోత్సవం

2010 ఏప్రిల్ 20న యునెస్కో చైనీస్ భాషా దినోత్సవాన్ని యూఎన్ అధికారిక భాషలలో ఒకటిగా జరుపుకోవాలని ప్రకటించింది. అప్పటి నుంచి చైనీస్ భాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఈరోజునే జరుపుకుంటారు. 

పానిపట్ యుద్ధం

పానిపట్ యుద్ధం అనేది మూడు ప్రధాన యుద్ధాలు. అవి 1526, 1556, 1761లలో ఉత్తర భారత చరిత్రలో జరిగిన ముఖ్యమైన యుద్ధాలు. ఈ యుద్ధాలు ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలోని పానిపట్ వద్ద జరిగాయి. మొదటి పానిపట్ యుద్ధం 1526 ఏప్రిల్ 20న జరిగింది. ఈ యుద్ధంలో బాబర్.. ఇబ్రహీం లోడిని ఓడించాడు. అప్పుడే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపనకు నాంది పడింది. 

చైనాలో భూకంపం

2013 ఏప్రిల్ 20న చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని లుషాన్ కౌంటీ, యాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ప్రమాదంలో 150 మందికి పైగా మరణించారు. ఇంకా వేలాది మంది గాయపడ్డారు.