calender_icon.png 4 February, 2026 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

23-02-2025 12:20:32 AM

నేనంటే.. నేనే ఫస్ట్?

కొన్నేళ్ల క్రితం వరకు ఆరుబయట కూర్చొని వైకుంఠపాళి, పులి మేక, అష్టాచమ్మా వంటి ఆటలు ఆడుకునేవాళ్లం. ఇక చిట్టీలాట కూడా అప్పట్లో చాలా ఫేమస్. స్కూల్‌లో ఖాళీ టైమ్ దొరికితే చాలు.. ఎక్కువగా ఈ ఆటతోనే టైమ్‌పాస్ చేసేవాళ్లం. ఈ ఆట రెండు రకాలుగా ఉండేది. ఒకటేమో.. నాలుగు ఒకే రకమైన చిట్టీలు మ్యాచ్ చేయాలి. అందులో ఓ జోకర్ చిట్టీ కూడా ఉంటుంది. అది వస్తే మూడు చిట్టీలు కలిసినా.. షో అయినట్టే. ఒకరు షో కొట్టిన తర్వాత రెండు, మూడు స్థానాల కోసం నేను ఫస్ట్ కొట్టాను అంటే నేను ఫస్ట్ కొట్టాను అని గొడవ కూడా పెట్టుకునేవాళ్లం. ఈకాలంలో ఆడే పబ్‌జీలా కాకుండడా అప్పటి ఆటలు.. ఆనందాలు భలే ఉండేవి.

చల్లని జ్ఞాపకం..

కాలం ముందుకు కదులుతున్న కొద్దీ మనకి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్తుంటుంది. అందులోనూ సమ్మర్ వచ్చిందంటే మన చిన్ననాటి ఎన్నో అందమైన జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. అబ్బో అప్పట్లో భలే ఎంజాయ్ చేసేవాళ్లం.. అనే మాట మన మనసు నుంచి తన్నుకొచ్చి.. ముఖంపై చిరునవ్వును పూయిస్తుంది. అలాంటి ఓ తియ్యని.. కమ్మని.. చల్లని జ్ఞాపకమే పుల్ల ఐస్.