calender_icon.png 23 January, 2026 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్ ఆవిష్కరణ

23-01-2026 06:38:24 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మర్రిగూడ మండల శాఖ ఆధ్వర్యంలో తపస్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్రిగూడ యందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మునయ్య మండల విద్యాశాఖాధికారి శ్రీ బిట్టు శ్రీనివాస్ జడ్పీహెచ్ఎస్ మర్రిగూడ  ప్రధానోపాధ్యాయులు శ్రీ జె.రూప్ సింగ్ చేతుల మీదగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర ప్రశిక్షణ విభాగ్ కో కన్వీనర్ శ్రీ పొనుగోటి రవీందర్ రావు తపస్ మండల అధ్యక్షులు శ్రీ మట్టపల్లి శ్రీరమణ  మండల ప్రధాన కార్యదర్శి శ్రీ బండారి శ్రీశైలం మోడల్ స్కూల్ మర్రిగూడ ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేష్ తపస్ మర్రిగూడ కోశాధికారి శ్రీ దేవులపల్లి ప్రవీణ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.