calender_icon.png 6 December, 2024 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మరంగా టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

08-11-2024 05:03:09 PM

అనంతగిరి (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం శుక్రవారం అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కోదాడ నియోజకవర్గ కోఆర్డినేటర్, రాష్ట్ర పార్టీ నాయకులు ముత్తినేని సైదేశ్వరరావు, పార్లమెంటరీ పార్టీ నాయకులు కొల్లు నరసయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాలుగా తెలంగాణలో అధికారంలో లేకపోయినా నేటికీ ఎంతోమంది కార్యకర్తలు పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీకి లేనటువంటి గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కిందన్నారు సభ్యత్వ నమోదుని మండలంలో అత్యధికంగా నమోదు చేయించాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.

నియోజకవర్గ కోఆర్డినేటర్ గా తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు పార్టీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అనంతగిరి మండల అధ్యక్షులు చాపల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశంలో 1239 పార్టీలు ఉన్నాయని, ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో 8వ స్థానంలో ఉండటం ఈ పార్టీకి ఉన్నటువంటి గౌరవం, ఔన్నత్యానికి మేము అందరం గర్విస్తున్నామని ఆశా భావం వ్యక్త చేశారు. మండలంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేస్తామని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, త్రిపురవరం గ్రామ శాఖ కొత్తా నరేష్ రెడ్డి, సాయన్న, రాంబాబు, నరేష్, వీరబాబు, సాయి, నరసయ్య, వెంకట్, నరేష్, అర్జున్, శివ, మంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.