12 June, 2026 | 5:34 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

బ్యాలెట్ బాక్సుల దుర్వినియోగం జరగలేదు

12-02-2026 03:12 PM

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత

పాల్వంచ,(విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు దుర్వినియోగం కాలేదని కమిషనర్ సుజాత స్పష్టం చేశారు. గురువారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో 47వ డివిజన్లోని 156వ పోలింగ్ కేంద్రానికి సంబంధించి కేవలం ఖాళీగా ఉన్న 'రిజర్వు' బ్యాలెట్ బాక్సును మాత్రమే వాహనంలో మరిచిపోయినట్లు వివరించారు. దీనిపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, పోలింగ్ సజావుగా సాగిందని తెలిపారు. భద్రతా ప్రమాణాల మధ్య కౌంటింగ్ కేంద్రానికి బాక్సులను తరలించామన్నారు.