4 April, 2026 | 2:57 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

కేంద్రం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలి

12-02-2026 01:52 PM

ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి

సమ్మెకు ఏఐటీయూసీ, సి పియుఎస్ఐ సిపిఐఎం సిఐటియు, అంగన్వాడి, వివిధ కార్మిక సంఘాల యూనియన్ల మద్దతు

తుంగతుర్తి, (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వామపక్షాల ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలు పాల్గొని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులు మాట్లాడుతూ... కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, కార్మికుల పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 4 లేబర్ కోడ్ లను మార్చటాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి వారికి తగిన ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. నరేంద్ర మోడీ అధికారులకు వచ్చిన వెంటనే అసంఘటిత సంఘంలో పనిచేసే 45 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత కల్పించే విధంగా ఈఎస్ఐ, పిఎఫ్, లాంటి ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. ఇవి ఏవి కల్పించకపోగా నాలుగు లేబర్ కోడ్ ల అమలతో 45 కోట్ల సంఘటిత అసంఘటిత కార్మికుల వారి కుటుంబాలు చితికి పోయేలా కార్పొరేట్లు లాభాలు పోగేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలోని కార్మిక చట్టాలను నియంత్రిత్వ దౌర్జన్యపూరితంగా కేంద్ర ప్రభుత్వం తమ చేతులకు తీసుకొని మార్చి వేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, ఏ ఐ టి యు సీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోతు రాజారాం, సిఐటియు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు బొంకూరు శ్యాంసుందర్, ఏఐటిసి నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు కోట రామస్వామి, పాల్వాయి పున్నయ్య బొంకురి ఎల్లయ్య, మనోజ్,అంగన్వాడీ టీచర్స్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, సుమిత్రా దేవి, స్వరూప, వివిధ కార్మిక సంఘాల నాయకులు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.