7 June, 2026 | 1:41 AM

శతక్కొట్టిన రాహుల్, గిల్

07-06-2026 12:17 AM

భారీస్కోరు దిశగా భారత్

రాణించిన సాయి సుదర్శన్, పంత్

తొలిరోజు భారత్ స్కోరు 368/3

ఆప్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్

ఆప్ఘనిస్థాన్‌తో ప్రారంభమైన ఏకైక టెస్టులో తొలిరోజు టీమిండియా దుమ్మురేపింది. బ్యాటర్లు సమిష్టిగా రాణించిన వేళ భారీస్కోరు దిశగా దూసుకెళుతోంది. కేఎల్ రాహుల్ క్లాస్.. కెప్టెన్ శుభమన్ గిల్ మాస్ బ్యాటింగ్ తొలిరోజు హైలెట్‌గా నిలిచాయి. ఆప్ఘన్ బౌలర్లు వికెట్లు తీయలేక నానా తిప్పలు పడ్డారు.

ముల్లాన్‌పూర్, జూన్ 6: ఈ మ్యాచ్‌లో భారత్ తరపున స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆరంభించారు. కొత్త బంతితో బౌలర్లకు సహకారం లభించడంతో ఓపికగా ఆడారు. అయితే అఫ్గానిస్థాన్ ఘోర తప్పిదం కేఎల్ రాహుల్‌కు కలిసొచ్చింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ కీపర్ క్యాచ్ ఇవ్వగాఅంపైర్లు ఔటివ్వలేదు.

అఫ్గాన్ రివ్యూ తీసుకో లేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా తేలింది. ఈ అవకాశంతో రాహుల్ చెలరేగాడు.ఆ కాసేపటికే జైస్వాల్(24) ఔట్ అవగా.. సాయి సుదర్శన్ కలిసి రాహుల్ ఇన్నింగ్స్ నడిపించాడు. సాయి సుదర్శన్ దూకుడుగా ఆడగా.. రాహుల్ తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్‌లోనూ ఈ జోడీ చెలరేగింది. అయితే ఈ ఇద్దర్నీ ఔట్ చేసే అవకా శాలు వచ్చినా అఫ్గాన్ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. లంచ్ తర్వాత రెండో సెషన్‌లోనూ ఈ జోడీ చెలరేగింది.

ఆడేది టెస్ట్ మ్యాచ్ అయినా సాయి సుదర్శన్ వేగం గా పరుగులు సాధించాడు. సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్ను సలీమ్ కీపర్ క్యా చ్‌గా పెవిలియన్ చేర్చాడు. దీంతో 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక్కడ నుంచి గిల్, రాహుల్ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో రాహుల్ 164 బంతుల్లో 12వ సెంచరీ పూర్తి చేసుకోగా.. గిల్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రాహుల్‌ను జియావుర్ రెహ్మాన్ ఔట్ చేసి మూడో వికెట్‌కు నమోదైన 167 పరుగుల భాగస్వామ్యా నికి తెరదించాడు.

అనంతరం క్రీజులోకి వ చ్చిన రిషభ్ పంత్ కలిసి గిల్ చెలరేగాడు. ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టడంతో భా రత స్కోర్ బోర్డు టాప్ గేర్‌లో సాగింది. ఈ క్రమంలో గిల్ 138 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కెరీర్‌లో ఇది 11వ టెస్ట్ సెంచరీ. ఓవరాల్‌గా 20వ అంతర్జాతీయ సెంచరీ. కేవలం 26 ఏళ్ల వయసులోనే గిల్ ఇన్ని సెంచరీలు చేశాడు.కాగా గిల్ టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్క్ను అందుకున్నాడు. 15 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించాడు. తద్వా రా భారత్ తరఫున కెప్టెన్‌గా తక్కువ ఇన్నింగ్స్‌లలో వెయ్యి పరుగుల మార్క్ దాటిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.

మొదటి స్థానంలో సునీల్ గావస్కర్ (14 ఇన్నింగ్స్లు) ఉన్నాడు. అంతేకాదు కెప్టెన్ అయిన అతి తక్కువ రోజుల్లోనే టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు. ఇక ఓవరాల్‌గాభారత్ తరఫున కెప్టెన్‌గా వెయ్యి పరు గులు చేసిన కెప్టెన్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు. అలాగే అత్యధిక టెస్ట్ శతకాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో టాప్-5లోకి చేరాడు. గిల్ భారత టెస్ట్ జట్టు కెప్టెన్గా 6 శతకాలు సాధించాడు. ఈ జాబితా లో విరాట్ కోహ్లి (20) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 

ఇదిలా ఉంటే చివర్లో రిషబ్ పంత్ కూడా దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేశా డు. మరో 5 ఓవర్ల ఆట ముగిలుండగానే అంపై ర్లు తొలి రోజు ఆటను ముగించారు. దీంతో తొలికోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్లకు 368 పరుగులు చేసింది. అప్ఘానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ సలీమ్ సఫీ రెం డు వికెట్లు తీశాడు. రెహ్మాన్ షరీఫ్ ఒక వికెట్ పడగొట్టారు. టీమిండియా రెండో రోజు ఆటలో 500 రన్స్ మార్కును చేరుకుని.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 368/3 (జైస్వాల్ 24, రాహుల్ 100, సాయి సుదర్శన్ 81, గిల్ 103 నాటౌట్, పంత్ 50 నాటౌట్; సలీ మ్ సఫి 2/67, రహమాన్ షరీఫి 1/61)