7 June, 2026 | 1:58 AM

నార్వే చెస్ విజేత ప్రజ్ఞానంద

07-06-2026 12:13 AM

చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్

నార్వే టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు

ఓస్లో, జూన్ 6: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తద్వారా ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. తన ఆఖరి రౌండ్లో జర్మనీ ప్లేయర్ విన్సెంట్ కేయ్మెర్‌ను ఓడించిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద.. అద్భుతమైన రీతిలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 15 పాయింట్లతో చివరి గేమ్ ను ప్రారంభించిన ప్రజ్ఞానంద.. క్లాసికల్ గేమ్‌ను  గెలిచి కీలకమైన మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో చెస్ టోర్నీల్లో ప్రతిష్టాత్మకంగా భావించే నార్వే టైటిల్ అతన సొంతమైంది. ఈ గెలుపుతో గతంలో భారత చెస్ దిగ్గజాలు విశ్వ నాథన్ ఆనంద్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డీ గుకేశ్ సాధించని ఘనతను సాధిం చాడు. ఇప్పటి వరకూ ఏ భారత ప్లేయర్ కూడా నార్వే చెస్ టోర్నీ గెలుచుకోలేకపోయారు. ఈ టోర్నీని 2013 నుంచి నిర్వహి స్తున్నారు. గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీలో పాల్గొనడం ఇది రెండోసారి మాత్రమే. ఈ టోర్నీలో రెండు సార్లు వరల్డ్ నెం.1 ప్లేయర్ మాగ్నస్ కార్లసన్ విక్టరీ సాధించాడు.

గతంలో ఏడు సార్లు నార్వే చెస్ టైటిల్ గెలిచిన కార్లసన్ తన క్లాసికల్ గేమ్‌లో రెండు సార్లు ప్రజ్ఞానంద చేతిలో ఓటమి పా లయ్యారు. ఈ అద్భుత విజయం ప్రజ్ఞానందను పాయింట్ల రేసులో ముందుంచింది. టోర్నమెంట్ చివరి దశలో వరల్డ్ చాంపియన్ గుకేశ్ కొంత తడబడ్డాడు. కాగా ప్రతి ష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా 20 ఏళ్ల ప్రజ్ఞానంద ఘనత సాధించడంపై ప్రధాని నరేంద్ర మో దీ హర్షం వ్యక్తం చేశారు. అతడి ప్రతిభకు ఇదో కీలక మైలురాయి అంటూ ప్రశంసించారు.

ప్రజ్ఞానంద భవిష్యత్తులో మరిన్ని విజ యాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సైతం యువ గ్రాండ్‌మాస్టర్‌ను అభినందించారు. ఈ అద్భుతమైన విజయం అతని అసాధారణ ప్రతిభకు, అచంచలమైన అంకితభావానికి, ఏళ్ల తరబడి చేసిన కృషికి నిద ర్శనమన్నారు. ప్రపంచ వేదికపై అత్యుత్తమమైన ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేశాడని ప్రశంసించారు. ప్రజ్ఞానంద విజయం దేశంలోని ఎందరో యువ చెస్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు. వ్యాపారవేత్త అదానీ ప్రజ్ఞానందకు అభినందనలు తెలిపారు.