15 July, 2026 | 7:02 AM

భారత్ చేరుకున్న టీమిండియా.. సాయంత్రం భారీ రోడ్ షో

04-07-2024 10:42 AM

ముంబై: రెండోసారి టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకున్న టీమిండియా వెస్టిండీస్ నుంచి భారత్ కు చేరుకుంది. టీ20 ప్రంపంచకప్ మ్యాచ్ తో క్రికెట్ జట్టు సగర్వంగా ఇండియాకు చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో భారత క్రికెట్ జట్టుకు ఘనస్వాగతం పలికారు. టీమిండియా ఆటగాళ్లు గురువారం ప్రధాని మోడీని కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రధాని కలవనున్నారు. టీ-20 ప్రపంచకప్ సాధించిన జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించనున్నారు. సాయంత్రం ముంబయిలో టీమిండియా క్రికెటర్లు రోడ్ షో జరగనుంది. ఓపెన్ టాప్ బస్సులో ముంబయి ప్రధాన రహదారులపై క్రికెటర్లు ఊరేగింపు చేపట్టనున్నారు.