క్యాన్సర్ చికిత్సలో సాంకేతికతలు

28-09-2026 | 05:10am

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): క్యాన్సర్ చికిత్సలో (Cancer treatment)ఆధునిక సాంకేతి కత, కృత్రిమ మేధ, వైద్య భౌతిక శాస్త్రం కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు తెలిపారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ రేడి యేషన్ ఆంకాలజీ విభాగాధిపతి డా. టి. ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఫిజిసిస్ట్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ వార్షిక సదస్సు సె ప్టెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించారు. సదస్సుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఎం. కుమార్ మొలుగా రం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అధునాతన భౌతిక శాస్త్రం, కృత్రిమ మేధ, ప్రజా రోగ్య మౌలిక వసతులను సమన్వయం చే యడం ద్వారా నాణ్యమైన వైద్య సేవలను మరింత విస్తృతంగా అందించవచ్చని ఆయ న తెలిపారు. రేడియేషన్ డోసిమెట్రీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ భద్రత, ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు తదితర అంశాలపై నిపుణులు చర్చించారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ బి. భాస్కర్‌రావు మాట్లాడుతూ, క్యాన్సర్కు అన్ని రకాల చికిత్సలు అందించేందుకు కిమ్స్లో అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులు, నిపుణు లైన వైద్య బృందం ఉందన్నారు.

ఉస్మాని యా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎం. కుమార్ మొలుగారం మాట్లాడు తూ.. కిమ్స్ సికింద్రాబాద్ రేడియేషన్ ఆంకాలజీ విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన పరిశోధనా కేంద్రంగా కొనసాగుతోందన్నారు. మెడికల్ ఫిజిక్స్లో పోస్ట్ ఎంఎస్సీ డిప్లొమా కోర్సు నిర్వహణకు కిమ్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం ఉందని తెలిపారు. కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సాంబిత్ సాహు, చీఫ్ మెడికల్ ఫిజిసిస్ట్, ఆర్‌ఎస్‌ఓ డాక్టర్ కె. కృష్ణ మూర్తి, సీనియర్ మెడికల్ ఫిజిసిస్ట్ డాక్టర్ పీబీఎల్డీ ప్రసాద్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు