సాయిధ పోరాటయోధుల త్యాగాలు చిరస్మరణీయం

15-09-2026 | 04:47pm

దేశంలో అన్ని పోరాటాలకు మార్గదర్శి తెలంగాణ రైతాంగ పోరాటం

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్

హుజూర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల ఆనాటి త్యాగాలు చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్(CPI state executive member Ganna Chandrasekhar) అన్నారు.మంగళవారం పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో(Telangana Farmers Armed Struggle Week celebrations) భాగంగా అమరుల స్తూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతంలో రైతు బిడ్డల ధైర్యం కమ్యూనిస్టు నాయకుల నాయకత్వం పోరాటం దేశానికి మంచి చరిత్రను ఇచ్చిందన్నారు. రాజ్యాధికారానికి వ్యతిరేకంగా దేశంలో జరిగిన తొలి సాయుధ  పోరాటంగా రైతాంగ పోరాటం నిలిచిందన్నారు.

జమీందారీ విధానం బానిసత్వం వెట్టి చాకిరి లేకుండా చేసింది కమ్యూనిస్టుల పోరాటమే అన్నారు.రజాకార్ల దురాగతాలను అడ్డుకొని దున్నేవాడికే భూమిపై హక్కును కల్పించింది అణగారిన వర్గాలకు హక్కులు కల్పించి సమానత్వం వైపు మార్గాలు వేసింది ఆనాటి సాయిధ పోరాటయోధుల త్యాగాలతో కూడిన జీవితమేనన్నది మరవరాదన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు, మామిడి వెంకటేశ్వర్లు, పశ్య శ్రీనివాసరెడ్డి, కంబాల శ్రీనివాస్, నారాయణ, జడ శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, దొంతగాని సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు