ఘనంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

16-09-2026 | 09:11pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో(Telangana Farmers Armed Struggle Week Celebrations) భాగంగా సీపీఐ ఘట్ కేసర్ మండల సమితి ఆధ్వర్యంలో అన్నోజీగూడ లోని కెఎల్. మహేంద్ర నగర్ వికలాంగుల కాలనీలో ర్యాలీ నిర్వహించి, మహేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ సీనియర్ నాయకులు, కెఎల్. మహేంద్ర నగర్ కాలనీ వ్యవస్థాపకులు టి. మల్కయ్య మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, జమీందారీ, దొరల దోపిడీ, వెట్టిచాకిరీ, భూమిపై పెత్తందారీకి వ్యతిరేకంగా రైతాంగం, కూలీలు, పేద ప్రజలు కమ్యూనిస్టు పార్టీ(Communist Party) నాయకత్వంలో విస్తృతంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.

ఈ పోరాటం కేవలం రాజకీయ అధికార మార్పు కోసం జరిగినది కాదని, భూమి, జీవన హక్కులు, సామాజిక గౌరవం కోసం సాగిన ప్రజా పోరాటమని చరిత్ర స్పష్టం చేస్తోందన్నారు . కమ్యూనిస్టు పార్టీ అధికారిక చరిత్రలోనూ తెలంగాణ పోరాటాన్ని నిజాం నిరంకుశత్వం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన చారిత్రక రైతాంగ పోరాటంగా నమోదు చేసిందన్నారు . ఈచారిత్రక పోరాటంలో వేలాది మంది రైతులు, కూలీలు, మహిళలు, యువకులు చేసిన త్యాగాలను విస్మరించి, రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించడం ప్రజల చరిత్రను అవమానించడమే అని సిపిఐ పేర్కొంటుందన్నారు. 

మరిన్ని వార్తలు