2 June, 2026 | 6:30 PM

Breaking News

భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •   కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •  

అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు

02-06-2026 05:50 PM

మంథని సహకార సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): అమరవీరుల త్యాగాలే తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి పునాధులని మంథని సహకార సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. తెలంగాణా అవతరణ దినోత్సవ సందర్భంగా మంగళవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం పర్సన్ ఇంచార్జి చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... నేటితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశపు 29వ రాష్ట్రంగా అవతరించింది.

ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు,  ప్రజల ఆకాంక్షల ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రం నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు, భాష, కళలను ప్రపంచానికి చాటిచెప్పే రాష్ట్రంగా ఎదుగుతోందని, వ్యవసాయం, విద్య, పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో మరింత పురోగతి సాధిస్తుందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ స్పూర్తిని సజీవంగా ఉంచుతూ, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం లక్ష్యాల సాధనకు ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ల నాయకత్వంలో ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులర్పించారు.