21 July, 2026 | 5:26 PM

గురుపౌర్ణమి కరపత్రిక ఆవిష్కరణ

21-07-2026 12:27 PM

షిరిడి సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి కరపత్రిక ఆవిష్కరణ: చైర్మన్ నల్లపాటి నరసింహారావు

కోదాడ జూలై 21,(విజయ క్రాంతి): గురు పౌర్ణమి(Guru Purnima Pamphlet) మహోత్సవాలను పురస్కరించుకుని షిరిడి సాయిబాబా మందిరంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల కరపత్రికను ఆలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుపౌర్ణమి రోజున నిర్వహించే పూజలు, భజనలు, పాలాభిషేకం, అన్నదానం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.