21 July, 2026 | 6:31 PM

ఎల్ నినో ప్రభావంపై అవగాహన సదస్సు.. రైతులకు కీలక సూచనలు

21-07-2026 01:43 PM

ఎల్ నినో ప్రభావంపై కోనరావుపేటలో అవగాహన సదస్సు.. రైతులకు కీలక సూచనలు

కోనరావుపేట, జూలై 21 (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ మస్కూరి కాశీరాం అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఎల్ నినో ప్రభావం, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రభుత్వ సబ్సిడీలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విబిజి-ఆర్ఏఎమ్జి పథకం కింద భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టాల్సిన ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్లు, బోర్‌వెల్ రీఛార్జ్ పిట్లు, మ్యాజిక్ డ్రైన్లు వంటి నిర్మాణాల ప్రాముఖ్యతను వివరించారు.

అలాగే ఈ నిర్మాణాలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.వర్షాకాలంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు, పంటల ఎంపికలో అనుసరించాల్సిన విధానాలు, నీటి సంరక్షణ చర్యల గురించి గ్రామసభకు హాజరైన రైతులు, ప్రజలకు అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) రమేష్, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ, ఏఎన్‌ఎం సరిత, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.