17 July, 2026 | 8:39 AM

జలాశయాల్లో పూడికతీత విధానంపై ప్రభుత్వం ఉత్తర్వులు

19-11-2024 02:02 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రిజర్వాయర్లు, డ్యామ్ లలో పేరుకుపోయిన పూడికతీత విధానంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జలశక్తి శాఖ విధానం మేరకు రెవెన్యూ జనరేషన్ విధానంలో జాలాశయాల్లో పూడికతీత చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా విధానం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొదట పైలట్ పద్ధతిలో పూడికతీత చేయపట్టాలని నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేసినట్లు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు.