భవిష్యత్‌లో బీసీ నేతే సీఎం

04-10-2026 | 08:30pm

హైదరాబాద్: భవిష్యత్‌లో తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) అన్నారు. శంషాబాద్‌లో నిర్వహించిన ఓబీసీ కులగణన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీసీ సీఎం అభ్యర్థికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి మద్దతు ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వర్గానికో, వ్యక్తికో, ప్రాంతానికో పరిమితం కాదని.. జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి తగిన వాటా దక్కాలన్నదే తమ విధానమని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.

అన్ని కులాల మద్దతుతో బీసీలు తమ హక్కుల కోసం పోరాడుతారని అన్నారు. ఓబీసీ కులగణనలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన విమర్శలు చేశారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గం, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవుల్లో బీసీల ప్రాతినిధ్యం పెంచుతామని తెలిపారు. 2039 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమకు ప్రజల మద్దతు తెస్తాయని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు