వార్డు సభ్యులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
- న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి
- రాష్ట్ర అధ్యక్షుడు బొర్ర సురేష్ కుమార్
బెజ్జంకి, అక్టోబర్ 4 (విజయ క్రాంతి): తెలంగాణ వార్డు సభ్యుల ఫోరమ్(Telangana Ward Members Forum) ఆధ్వర్యంలో బెజ్జంకి మండల వార్డు సభ్యుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొర్ర సురేష్ కుమార్(Borra Suresh Kumar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాభివృద్ధిలో వార్డు సభ్యులు చొరవ చూపాలని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. వార్డు సభ్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, గౌరవ వేతనం అందించడంతో పాటు అభివృద్ధి పనుల శిలాఫలకాలపై వారి పేర్లు పొందుపరచాలని కోరారు.
నూతన నియామకాలు
సమావేశంలో బోనగిరి మంజులను సిద్దిపేట జిల్లా మహిళా కన్వీనర్‌గా, కొంపల్లి పద్మను బెజ్జంకి మండల మహిళా అధ్యక్షురాలిగా, సావనపల్లి రాజును జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. కొంకటి రాములు మండల ప్రధాన కార్యదర్శిగా, పలువురిని ఇతర బాధ్యతల్లో నియమించి నియామక పత్రాలు అందజేశారు. సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.