పద్మశాలి ఉద్యోగ సంఘం పరామర్శ
ముత్తారం, అక్టోబర్ 04 (విజయక్రాంతి): తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం(Telangana Padmashali Employees Association) పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల కోటేశం తండ్రి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పరికిపండ్ల రాజలింగం(Parikipandla Rajalingam) (85) అనారోగ్యంతో మృతి చెందారు. గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ముత్తారంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
రాజలింగం మృతి విషయం తెలుసుకున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఫోన్ ద్వారా కోటేశంను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కొలిపాక సారయ్య ఆధ్వర్యంలో సంఘం నాయకులు రాజలింగం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి డా. దుబాసి విష్ణుమూర్తి, జిల్లా కోశాధికారి కొలిపాక నగేష్, ఉపాధ్యక్షుడు తాటికొండ వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి అనుమాండ్ల రాజశేఖర్, నాయకులు బూర్ల రాజేందర్, ఇప్పనపల్లి మధుకర్, బుదరపు సంపత్, దొంతుల సురేష్, రంగు రవి, సురేష్, గోవర్ధన్, గూట్ల రమేష్, చిలకాని సారయ్య, చిందం సదానందం, గడ్డం విద్యాసాగర్, నల్లాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.