ఘట్ కేసర్ సహకార సభలో రైతు రుణమాఫీ రగడ

28-09-2026 | 08:34pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని నారాయణ గార్డెన్ లో సోమవారం జరిగిన ఘట్కేసర్ రైతు సేవా సహకార సంఘం(Ghatkesar Farmers Service Cooperative Society) 46వ సర్వసభ్య సమావేశం ఉద్రిక్తంగా మారింది. అర్హులైన రైతులకు రుణమాఫీ(Rythu RunaMafi) ఎందుకు అందలేదంటూ రైతులు పాలకవర్గాన్ని నిలదీశారు. రైతుల అభివృద్ధి ఎక్కడ జరిగిందని, బంగారం కుదువ పెట్టుకుని డబ్బులు ఇవ్వడం వసూలు చేసుకోవడంగా వ్యాపారం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార సంఘానికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యఅతిథి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి(Former MLA Malipeddi Sudheer Reddy) మాట్లాడుతుండగా రైతులు తమకు రుణమాఫీ ఎందుకు జరగలేదని ప్రశ్నించడంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభుత్వానికి పంపిన రైతుల నివేదికలో కొన్ని తప్పిదాల వల్ల రుణమాఫీ జరగలేదని, ఇక జరిగే అవకాశం లేదని అనడంతో  రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రైతులకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్(BRS) నాయకులు రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేశారు. మొదట 2025-26 సంవత్సరపు వార్షిక నివేదికను మేనేజర్ జయప్రకాష్ చదివి వినిపించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు బద్దం అనంత్ రెడ్డి, సభ్యులు రేసు లక్ష్మారెడ్డి, జిల్లాల పోచిరెడ్డి, బీరెడ్డి స్రవంతి, వడ్త్యా మహేందర్, చందుపట్ల ధర్మారెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, జరిగే రమేష్, గోపు బాలరాజ్, రామకృష్ణారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు