12 March, 2026 | 10:09 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

భరోసా కేంద్రం బాధితులు ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది

26-04-2025 12:36 AM

 వనపర్తి టౌన్  ఏప్రిల్  25: వనపర్తి జిల్లాలో  పోక్సో మరియు అత్యాచార బాధితులకు వైద్య, న్యాయ, సైకాలజికల్ సపోర్ట్ వంటి సేవలు ఒకే గొడుగు కిందకి తీసుకు వచ్చి  పోలీసుశాఖలోని ఉమెన్ సేఫ్టీవింగ్ తమ వంతు సేవలు అంది స్తోంది.ఈ భరోసా కేంద్రము బాధితులు ఆర్థికంగా ఎదిగేలా స్వశక్తిపై జీవించేలా సహాయ సహకారాలు అందజేస్తుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.

శుక్రవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం పక్షాన ఫోక్సో  మరియు అత్యాచార కేసుల్లో ఉన్న ఎంతోమంది బాధితులకు అన్ని రకాలుగా వారి ఆర్థిక  పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని  తక్షణ సహాయo అందిస్తోంది. పోలీస్ శాఖ అందించే ఈ ఆర్థిక సహాయాన్ని సద్వి నియోగం చేసుకొని మంచిగా చదివి మంచి మార్కులు సా ధించిన విద్యార్థినీలను శుక్రవారం తమ చాంబర్లో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ సన్మానించి అభినందించారు.

ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ... ఫోక్సో మరియు  అత్యాచారం భరోసా కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. ఆర్థిక భరోసాతో ఉన్నత చదువులు చదివి అన్ని రంగాలలో రానించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఎదిగి  తమ కాళ్లపై  నిలబడగలిగి మహిళ సాధికారతలో భాగం కావాలని ఎస్పీ సూ చించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ అదనపు ఎస్పి, ఉమామహేశ్వరరావు,  ఏహెచ్ టి యు, ఎస్త్స్ర, అంజద్, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, భరోసా సిబ్బంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు.