లేబర్ కోడ్లను కేంద్రం రద్దు చేయాలి
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారత కార్మిక సం ఘాల సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండి చాంద్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం అసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్‌లో పోస్టర్లను విడుదల చేశారు. కార్మిక సంఘాలతో చర్చించకుండా, పార్లమెంట్లో సమగ్ర చర్చలు జరపకుండా ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నా రు.
ఈ నేపథ్యంలో మార్చి 16న (నేడు) కలెక్టరేట్ల ముట్టడి, 23న హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీరన్న, జాడి తిరుపతి, అఖిల్, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, మండల నాయకులు సమీర్, తరుణ్, కార్మికులు బాబా, రాజన్న పాల్గొన్నారు.




