మీటింగ్ మధ్యలోంచి లేచెళ్లిపోయిన సీఎం
పంజాబ్ రైతులతో సమావేశంలో ఘటన..
సీఎం తమ ఆందోళనలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న రైతు సంఘాల నాయకులు..
చంఢీగర్: సంయుక్తి కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) లీడర్లు తమ ఆందోళలను ప్రభుత్వానికి తెలిపేందుకు ఈ నెల 5న నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. అయితే ఈ చర్చల సమయంలో సీఎం మధ్యలోనే లేచి వెళ్లిపోయారని సీనియర్ రైతు నాయకుడు ఒకరు తెలిపారు. సీఎం తమ ఆందోళనలను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతు నాయకుడు బల్బీన్ సింగ్ రాజేవాల్ మాట్లాడుతూ.. ‘సీఎం మీటింగ్ సమయంలో కోపం తెచ్చుకున్నారు. మీకు నచ్చినది చేసుకోండి. అవసరం అయితే 5న నిరసన చేసుకోండి’ అని సీఎం రైతులతో చెప్పినట్లు ఆయన వివరించారు.
ఈ మీటింగ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సీఎం మాన్ ఒక ట్వీట్ చేశాడు. ‘రోడ్లు బ్లాక్ చేయడం, రైళ్లను అడ్డగించడం, పంజాబ్ బంద్‌కు పిలుపునివ్వడం వల్ల మీ సమస్యలు తీరవు. ఈ చర్యలు కేవలం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇది సమాజంలోని ఇతర వర్గాల పనులపై ప్రభావం చూపిస్తుంది’. అని సీఎం పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై కాంగ్రెస్ నేత పర్గాట్ సింగ్ స్పందిస్తూ.. ఇప్పటి వరకు ఏ పంజాబ్ సీఎం కూడా రైతులతో ఈ విధంగా వ్యవహరించలేదని ఆరోపించారు.
రైతుల డిమాండ్లివే..
రైతు సంఘాల నాయకులు పంజాబ్ ప్రభుత్వం తీరును తప్పబడుతున్నారు. గతంలో 17 డిమాండ్లలో 13 డిమాండ్లను నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అంటున్నారు. ఇక ఇప్పుడు రైతులు డిమాండ్ చేస్తున్న అంశాలివే..
1) రైతులకు రైఫిల్ లైసెన్స్ జారీ చేయాలి. అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడుకునేందుకు ఇది సహాయపడుతుంది.
2) రైతులకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అమర్చాలి.
3) చెరుకు రైతులు వరదల వల్ల నష్టపోతే పరిహారం అందించాలి.
4) కోచైఆపరేటివ్ సంఘాల్లో కొత్త అకౌంట్లు తెరిచేందుకు ఉన్న పరిమితులను ఎత్తేయాలి.
5) రైతుల సమస్యల పరిష్కారం కోసం అదనపు సబ్ ఏర్పాటు చేయాలి.






