కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా చేస్తోంది
భూదందాల మీదే ప్రభుత్వం నడుస్తోంది
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి
టీఆర్‌ఎస్ హ్యాంగ్ ఓవర్ నుంచి కవిత బయట రాలేదు
బీజేపీ ఎంపీ అరవింద్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని, వేలం..భూదందాల మీదే గవర్నమెంట్ రన్ అవుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఎవరేం అనుకున్న హిల్ట్ పాలసీ అమలు చేస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని, హౌస్ కమిటీ వేసి రివ్యూ చేయలేని కనీస జ్ఞానం కూడా లేదన్నారు.
అప్పులు చేసి జల్సా చేస్తామనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందని, చనిపోయిన శంకర్ గౌడ్‌కు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఒక క్రీడాకారుడికి కోటి రూపాయలు, డీఎస్పీ ఉద్యోగం ఇచ్చారని, మరి సామాన్య ప్రజల చావు అంటే ప్రభుత్వానికి పట్టదా? అ ని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి ధరణి, ఈహై కారు రేస్ దేనిపైఒక్క కేసు నమోదు చేయలేదని, ఇప్పటిదాక ఒక్క ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, అరెస్టు ఎందుకు చేయలేదన్నారు.
కవిత పిట్టల దొరసాని..
ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. పిట్టల దొర క్యారెక్టర్ కేసీఆర్ అయితే, పిట్టల దొరసాని క్యారెక్టర్ కవితదని ఎద్దేవా చేశారు. సామాజిక తెలంగాణ రాలేదనే వాళ్లను ఓడిం చి... ప్రజలు బీజేపీని గెలిపించారన్నారు. రాజకీయంగా ఆమెను సమాధి చేసింది బీజేపీ అ న్నారు. బీజేపీ సపోర్ట్ లేకండానే రాష్ట్రం వచ్చిం దా అని ప్రశ్నించారు. ఇండియా పాకిస్తాన్ విభజన ప్రక్రియలో ఎంతోమంది చనిపోయారని, అలాగే తెలంగాణను ప్రకటించి కాంగ్రెస్ వెనక్కి తీసుకున్నారు కాబట్టే.. అంత మంది చనిపోయార్న ఉద్దేశంతో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అన్నారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ హ్యాంగ్ ఓవర్ నుంచి కవిత ఇంకా బయటపడలేదని ఆయన ఎద్దేవా చేశారు. అదృష్టం బాగుండి అజారుద్దిన్ మంత్రి అయ్యారన్నారు.






