16 August, 2026 | 2:02 PM

ఎమ్మెల్యే కూతురు వివాహ విందుకు హాజరైన సీఎం

16-08-2026 01:17 PM

నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం 

సీఎంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు 

కామారెడ్డి, ఆగస్టు 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కూతురు వివాహ విందుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 9.10 నిమిషాలకు వస్తారని భావించగా 12.10 గంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద డిబిఆర్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన వివాహ విందు కార్యక్రమానీ కి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. సీఎంతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, లు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దంపతులు సీఎం రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు.