7 March, 2026 | 2:17 PM

ఇందిరమ్మ రాజ్యంతోనే పేదల సొంతింటి కల సాకారం

06-03-2026 02:38 AM

నియోజకవర్గం ఇంచార్జి పామేన భీమ్ భరత్

శంకర్ పల్లి, మార్చి 5 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సామాన్యుల సొంతింటి కల నెరవేరుతుందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ అన్నారు.

గురువారం శంకర్ పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను రంగారెడ్డి జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ గారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భీమ్ భరత్ మాట్లాడుతూ ఆనాడైనా, ఈనాడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ పేదల పక్షానే ఉంటుందని, వారి అభివృద్ధి కోసమే నిరంతరం శ్రమిస్తుందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారని కొనియాడారు.

అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు అందజేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శంకర్ పల్లి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, బద్దం చిన్న కృష్ణ రెడ్డి, సేవాలాల్ అధ్యక్షులు నసీరోద్దీన్ పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీటీసీ ఏ జాజ్, కౌన్సిలర్ సమీ, ఏఎంసీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, శశికిరణ్, తౌఫీక్, శివ, అంతప్పగూడ కొండ పెంటయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ లు పాల్గొన్నారు.