6 June, 2026 | 11:32 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

తొలి గేమ్ డింగ్ లిరెన్‌దే

26-11-2024 12:05 AM

వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్

సింగపూర్: ప్రతిష్ఠాత్మక వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్‌లో లిరెన్ భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌ను 42 ఎత్తుల వద్ద ఓడించాడు. తొలి గేమ్‌లో తెల్ల పావులతో బరిలోకి దిగిన 18 ఏళ్ల గుకేశ్ తొలి ఎత్తులో లిరెన్‌పై పైచేయి సాధించినప్పటికీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు.

నల్లపావులతో బరిలోకి దిగిన లిరెన్ రెండో ఎత్తు నుంచి తన ఆధిపత్యం ప్రదర్శించాడు. నేడు ఇద్దరి మధ్య రెండో రౌండ్ గేమ్ జరగనుంది. డిసెంబర్ 12 వరకు 14 రౌండ్ల పాటు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో భారత్ నుంచి చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఐదుసార్లు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గాడు.