3 June, 2026 | 2:26 AM

పార్లమెంట్లో నాటి 39 మంది బీఎస్పీ ఎంపీల మద్దతు వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం

03-06-2026 01:41 AM

 బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్

రంగారెడ్డి, జూన్ 2(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక బహుజన సమాజ్ పార్టీ పోషించిన చారిత్రక పాత్రను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భం గా మీడియాతో మాట్లాడుతూ... నాటి పార్లమెంట్లో కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ఒంటరిగా తెలంగాణను సాధించడం అసాధ్యమని స్పష్టం చేశా రు.

బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎలాంటి బేరసారాలు లేకుం డా తెలంగాణ బిల్లుకు బేషరతు మద్దతు ప్రకటించారని తెలిపారు.లోక్సభలో 21 మంది, రాజ్యసభలో 18 మంది చొప్పున మొత్తం 39 మంది బీఎస్పీ ఎంపీల బలమైన మద్దతుతోనే తెలంగాణ బిల్లు చట్టబద్ధంగా ఆమోదం పొందిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. మలిదశ ఉద్య మంలో ప్రాణాలు కోల్పోయిన 1200 మం ది అమరవీరులలో 90 శాతం మంది బహుజన బిడ్డలేనని, కానీ రాష్ట్రం వచ్చాక ప్రాం తీయ పార్టీలు బీఎస్పీ క్రెడిబిలిటీని తొక్కిపెట్టాయని ఆరోపించారు.

పదేళ్లు ఒక కుటుం బం రాష్ట్రాన్ని దోచుకుంటే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బహుజనులను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని విమర్శించారు. రాబో యే రోజుల్లో అమరవీరుల ఆశయాల సాధనకై సామాజిక న్యాయంతో కూడిన ’బ హుజన తెలంగాణ’ నిర్మించడమే లక్ష్యంగా బీఎస్పీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని ఇ బ్రాం శేఖర్ ప్రకటించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ కృష్ణ, కోఆర్డినేటర్ లు దయానందరావు,, ఈశ్వర్, హై దరాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్, బండారి శ్రీనివాస్, మేడ్చల్ అధ్యక్షులు విజయరాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.