21 March, 2026 | 3:46 AM

ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యం

21-03-2026 12:09 AM

కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి

మహేశ్వరం, మార్చి 20 (విజయక్రాంతి): ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టి, పారదర్శకమైన జాబితాను రూ పొందించడమే ’స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ముఖ్య ఉద్దేశమని కందుకూరు ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడు తూ.. చట్ట ప్రకారం ప్రతి ఎన్నికల ముందు ఈ ప్రక్రియ జరగాల్సి ఉంటుందని వివరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకా రం ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గ తహసీల్దార్లు, ఆర్డీవో కార్యాలయ అధికారులు, ఎలక్షన్ విభాగం సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.