శ్రీరామ నవమి వేడుకలకు చింతమడకకు రండి
మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రం అందజేసిన గ్రామస్తులు
సిద్దిపేట రూరల్, మార్చి 20:శ్రీరామ నవమి వేడుకలకు రావాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన స్వగ్రామం చింతమడక గ్రామస్తులు శుక్రవారం ఎర్రవెల్లి లోని ఆయన నివాసంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25, 27న మండలంలోని చింతమడక లో జరిగే శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ట తో పాటు, శ్రీరామ నవమి వేడుకలు జరగనున్నాయని,
అందుకు హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ ఆద్వర్యంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానం అందజేసినట్లు తెలిపారు. ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామస్తులు ఆకుల రామ గౌడ్, పెండల గణేష్, బైరి నర్సింహా రెడ్డి, వాతం శివ, పడకండి విశ్వనాధం, ఎల్లప్పగారి పోచయ్య తదితరులు ఉన్నారు.




