ఆయిజలో పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
అయిజ మార్చి 20: అయిజ మునిసిపాలిటీలోని పలు ప్రభుత్వ కార్యాలయాలైన ఆసుపత్రి, కస్తూర్బా పాఠశాల,హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ, ఆగ్రో, రైతు సేవాకేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ప్రభుత్వ ఆసుపత్రి లోని ఓపి రికార్థులను పరిశీలించి, సకాలంలో సరియైన మందులను రోగులకు పంపిణి చేయాలని ఆదేశించారు.
కస్తూర్బా పాఠశాల తరగతి గదులను సందర్శించి భోజన విధానం విద్యార్థుల హాజరు, శిక్షణ ప్రమాణలపై అధ్యాపకులతో చర్చించారు.హాస్టల్ పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి వసతి సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. హెచ్ పి గ్యాస్ ను తనిఖీ నిర్వహిస్తూ ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.




