10 May, 2026 | 11:54 AM

Breaking News

తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •   ఖమ్మంలో ఫుడ్‌ పాయిజనింగ్‌ కలకలం   •  

గండి లచ్చపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం

08-12-2025 12:00 AM

సర్పంచ్ జంగిటి అంజయ్య

తంగళ్ళపల్లి, డిసెంబర్ 7 (విజయ క్రాంతి ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేట గ్రామపంచాయతీ పాలకవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగ అన్నల కోటగా పేరొందిన గ్రామంలో ఈసారి కూడా ఏకగ్రీవ సంప్రదాయం కొనసాగడంతో గ్రామంలో ఆనందం నెలకొన్నది.

ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటించారు.తదుపరి ఉప సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవత కొనసాగింది. సర్పంచ్గా జంగిటి అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, వార్డు సభ్యులుగా బల్లేపు ప్రశాంత్, పుట్ట దేవరాజు, పుట్ట భాను, భామగారి వజ్రవ్వ, కుక్కల ఉమ, చదల సుమన్, బీపేట రేణుక, అనరాశి జలంధర్ ఎన్నికయ్యారు.

3వ వార్డు సభ్యుడు పుట్ట భాను ఉప సర్పంచ్గా ఏకగ్రీవం ఎంపికయ్యారు.ఈ సందర్భంగా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు సర్పంచ్ అంజయ్య, ఉప సర్పంచ్ భాను, వార్డు సభ్యులను పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. గ్రామాభివృద్ధి దిశగా పంచాయతీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తమయ్యింది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ సర్పంచ్ల పోరం జిల్లా అధ్యక్షుడు మాట్ల మధు, మండల అధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్ రావు, పడిగెల రాజు, కందుకూరి రామగౌడ్, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.