10 May, 2026 | 12:53 PM

Breaking News

అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •  

రాజకీయ సైద్దాంతిక శిక్షణ అవసరం

08-12-2025 12:00 AM

జనసేవా దళ్ శిక్షణను ప్రారంభించిన దండి సురేష్

ఖమ్మం టౌన్, డిసెంబర్ 7(విజయ క్రాంతి):  యువతలో శారీరక ధృడత్వంతో పాటు మానసిక పరివర్తన, సమాజం పట్ల అవగాహన అవసరమని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు. ఖమ్మం రూర ల్ ఏదులాపూరం మున్సిపల్ పరిధిలో జనసేవా దళ్ శిక్షణా శిబిరం ఆదివారం ప్రారంభమైంది. శిక్షణను సిపిఐ జిల్లా కార్యదర్శి సు రేష్, ఇన్స్పెక్టర్ కె. మురళి కృష్ణ ప్రారంభించారు.

ముందుగా ఏఐవైఎఫ్ జెండాను సిపి ఐ ఖమ్మం జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దండి సురేష్, కె మురళి కృష్ణ మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా కలిగిన యువత పాలక వర్గాల తీరుతో నైరాశ్యానికి గురవుతుందన్నారు. ఉపాధి, ఉద్యోగాల కల్పనలో పాలకులు విఫలం కావడంతో యువశక్తి నిర్వీర్యమవుతుందన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో యువత చైతన్యవంత మైన ఆలోచనలతో రాజకీయాల్లోకి రావాలని వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులకు మద్దతుగా నిలవాల్సి ఉందన్నారు.

నిరుద్యోగం పెరిగిన -నేపథ్యంలో పాలకులు కర్మ సిద్దాంతాన్ని బోధిస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తెలిపారు. సుదీర్ఘ కాలం పోరాటాలతో అనేక హక్కులను, సంక్షేమ పథకాలను సాధించిన భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవ ముగిం పు ఉత్సవాలను జనవరి 18న ఖమ్మంలో జరుపుకుం టుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఐదువేల మంది యువకులకు జన సేవాదళ్ శిక్షణ ఇస్తుమన్నారు. శారీరకంగా ధృడత్వం కలిగి ఉన్నప్పు డే మానసిక పరిపక్వత లభిస్తుందని శారీరక ధృడత్వం కలిగి సమాజ ఉన్నతికి కృషి చేయాలని వారు అన్నారు.

ఈకార్యక్రమం లో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మిడకంటి చిన్న వెంకట రెడ్డి, సిపిఐ ఖమ్మం జిల్లా సమితి సభ్యులు వెంపటి సురేందర్, సిపిఐ రూరల్ మండల కన్వీనర్ దండి రంగరావు, సిపిఐ ఖమ్మం రూరల్ మండలం నాయకులు వెన్నం భాస్కర్  మిడకంటి పెద్ద వెంకట్ రెడ్డి,

రైతు సంఘం నాయకులు మామిడి శంకర్ రెడ్డి, 31వ డివిజన్ కార్యదర్శి దొంతగని వెంకన్న, మండల నాయ కులు గణపరపు వీరన్న, రైతు సంఘం సీనియర్ నాయకులు మామిండ్ల నిరంజన్ రెడ్డి,మండల నాయకులు పొన్నెకంటి రామకృష్ణ, ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి నానాబాల రామకృష్ణ,ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు గణపారపు ఉపేందర్ తదితరులుపాల్గొన్నారు.