20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

గోరింటా మెరిసె.. మగువ మురిసే..

20-07-2026 12:00 AM

సుల్తానాబాద్ వాసవి మాత దేవాలయంలో వైభవంగా గోరింటాకు వేడుకలు.. పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు

సుల్తానాబాద్ , జూలై 19 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య మహిళలు శ్రీ కన్యకా పరమేశ్వరి (వాసవి మాత) దేవాలయం లో గోరింటాకు వేడుకల ను ఆదివారం వైభవంగా నిర్వహించారు... ముందుగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చేతులకు, కాళ్ళకు గోరింటాకును పెట్టారు,మన తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో మహిళలమంతా గోరింటాకు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

మహిళల తో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ గా వస్తుంది.పెళ్ళికి ముందుకూడాగోరింటాకుపెట్టుకుంటారు.అలా పెట్టుకోవడం ద్వారా అది ఎర్రగా పండితే వారి ప్రేమ అంత సౌఖ్యంగా ఉంటుంది అని మహిళలు ఆన్నారు, గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, అలాగే కాళ్లు చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల చల్లదనంగా ఉంటుందని మహిళలు తెలిపారు.... మహిళలంతా సంతోషంగా గోరింటాకు వేడుకలు జరుపుకున్నారు.