మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్య పరిష్కరించాలి...
ఏఐటియుసి డిమాండ్...
బాన్సువాడ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన పథకం(Mid-Day Meal Scheme) కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు దుబాస్ రాములు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వాహకులకు రావలసిన మూడు నెలల పెండింగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలని, ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు అందించే అల్పాహారం మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు అప్పగించాలి అని ఆయన డిమాండ్ చేశారు.
సెంట్రాలైజ్డ్ కిచెన్ విధానం పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని ఆయన డిమాండ్ చేశారు. ఏజెన్సీ కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేవరకు దశల వారి ఉద్యమాలకు సిద్ధంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంద శంకర్, పత్తి శ్రీను, సాయిలు, విజయలక్ష్మి, స్వరూప, మనేవ్వ, హేమలత తదితరులు పాల్గొన్నారు.