14 April, 2026 | 5:12 PM

Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •  

లీక్ అవుతున్న మిషన్ భగీరథ పైప్‌లైన్

10-02-2026 12:00 AM

శ్రీరంగాపూర్ ఫిబ్రవరి 9 : మండల పరిధిలోని వెంకటపురం గ్రామం వద్ద జానంపేట గ్రామ రోడ్డుపై మిషన్ భగీరథ పైప్లైన్ రెండు చోట్ల లీక్ కావడంతో విలువైన తాగునీరు వృథాగా పాడవుతోంది. గత నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నా సం బంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీక్ అయిన పైప్లైన్ నుంచి నిరంతరం నీరు రోడ్డుపై ప్రవహించడంతో రహదారి పూర్తిగా తడిసి బురద మయంగా మారింది.

దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో మురుగు నీరు కలిసే ప్రమాదం ఉండటంతో తాగునీరు కలుషితమవుతుంద న్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీక్ అయిన పైప్లైన్ ను వెంటనే మరమ్మతులు చేయాలని, వృథా అవుతున్న నీటిని నిలిపివేసి ప్రజలకు సురక్షితమైన తాగునీరు అం దించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.