calender_icon.png 7 June, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేరు గొప్ప.. ఊరు దిబ్బ

04-06-2025 12:02:32 AM

  1.  జిల్లా కేంద్రం జగిత్యాల పట్టణ దుస్థితి 
  2.  చిన్న వానకే రోడ్లన్నీ చిత్తడి చిత్తడి 
  3.  జల మయమౌతున్నప్రధాన వీధులు 
  4.  అధ్వాన్నంగా టవర్ ఏరియా డ్రైనేజీ వ్యవస్థ    

జగిత్యాల, జూన్ 3 (విజయక్రాంతి): పేరు ప్రఖ్యాతులు గల ప్రాచీన చారిత్రక పట్టణం, ఒకప్పటి సమితి, తహశీల్ కేంద్రం, నేడది జిల్లా కేంద్రం. ప్రాచీన రాజరికపు చారిత్రక ఆనవాళ్ల్ల, ఎందరో కవి పండితులు, మరెందరో చరిత్రకారులు, విద్యావేత్తలు, రాజకీయ నేతలను తెలుగు జాతికి అందించిన పురిటిగడ్డ జగిత్యాల.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడ్డాక పేరుకే అదొక జిల్లా కేంద్రం.. పెద్ద మునిసిపాలిటీ... కానీ చిన్న చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడయ్యే అంతర్గత రోడ్లతో చారిత్రక పట్టణం జగిత్యాల ఇబ్బంది పడుతోంది.  ’పేరు గొప్ప ఊరు దిబ్బ’ అన్న నా నుడి సరిగ్గా సరిపోతుంది, అన్న చందంగా పరిణమించింది జగిత్యాల పట్టణ డ్రైనేజీ వ్యవస్థ దుస్థితి.

ఇటీవల తు ఫాను మూలంగా కురిసిన అ కాల వర్షాలతో జగిత్యాల పట్ట ణ ప్రధాన కూడలి టవర్ సర్కిల్లోని అంతర్గత రోడ్ల పరిస్థితికి అద్దం పడుతున్న చిత్రాలివి. ముఖ్యంగా టవర్ సర్కిల్ నుండి తహశీల్ చౌరస్తాకు వెళ్లే మార్కెట్ రోడ్డుతో పాటూ దాన్ని ఆనుకొని ఉండే సార్గమ్మ వీ ధి, బ్రాహ్మణవాడ, పోచమ్మ వాడ, గీతా భవ న్ రోడ్డు, సిటీ సోడా ప్రాంతాలు చిన్నవానకే చిత్తడై, ఆ రోడ్లపై నడకే నాట్యంగా మారుతున్నది.  గడిచిన ప్రభుత్వాల పాలనా కాలం లో ఎందరో రాజకీయ దురంధరులకు, మరెందరో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ స్థాయి నాయకులకు పుట్టినిల్లు జగిత్యాల.

అంగ బలం, అర్థ బ లం ఉపయోగించి సమాజాన్ని ఉద్ధరించిన సదరు నాయకులు తా ము పుట్టి, పెరిగిన జగిత్యాల పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం శోచనీయం. కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు వెచ్చించి పట్టణ సుందరీకరణ పనులు చేపడుతున్నా, జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధు ల రోడ్ల వెడల్పు జరగకపోవడమే ఎన్నో సమస్యలకు ముఖ్య కారణమన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జగిత్యాల నడిబొడ్డున గల ’టవర్ సర్కిల్’ ప్రాంతం పట్టణానికే తలమానికం.

ఈ సర్కిల్ నుండే అటు తహశీల్ చౌరస్తాకు, ఇటు బస్టాండుకు, మరోవైపు మంచినీళ్ల బావికి, తీన్ ఖనివైపుకు, అలాగే మరో దిక్కు గీతా భవన్ వైపు వెళ్లే ప్రధానమైన వీధులున్నాయి. అయితే ప్రధానంగా ఈ టవర్ నుండి తహశీల్ చౌరస్తా, గీతా భవన్ వైపు వెళ్లే రోడ్లు పల్లంగా దిగువ ప్రాంతంలో ఉండడంతో వర్షపు నీరంతా ఈ ప్రాంతంలోని వీధుల్లోకి వచ్చి చేరుతాయి. ఈ వీధుల్లో రోడ్లు ఇరుగ్గా ఉండడంతో, ఈ కాలనీల్లోని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షం పడితే చాలు మురికి కాలువలన్నీ నిండిపోయి, రోడ్లు కనిపించకుండా జలమయం అవుతాయి.

ఈ కాలనీలో నివసించే ప్రజలు చిన్న వర్షం పడితే చాలు వీధుల్లోకి వెళ్లడానికి, తమ ఇండ్లలోకి తిరిగి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నాయకులు ఆధిపత్య పోరు, వర్గ పోరు మరచి ఇలాంటి సమస్యల శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈ ప్రధాన వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, రోడ్ల దుస్థితి తీర్చి దిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారిస్తేబాగుంటుంది.